బ్యాలెన్స్ అయిపోయినా కాల్స్ చేసుకోవచ్చు‌

బ్యాలెన్స్ అయిపోయినా కాల్స్ చేసుకోవచ్చు‌

ప్రీ పెయిడ్ యూజర్స్ కోసం జియో గ్రేస్ పీరియడ్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు ఉపశమనం కలిగింలేలా ఓ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో రీచార్జ్ ప్యాకేజ్ అయిపోయిన ప్రీపెయిడ్ యూజర్లకు 24 గంటల పాటు గ్రేస్ పీరియడ్ లో జియో టూ జియో అపరిమిత కాల్స్ చేసుకునేలా వీలు కల్పించింది. లాక్ డౌన్ తో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రీచార్జ్ షాప్స్ సర్వీసులు పునరుద్ధరించారు. అదే రెడ్ జోన్లలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సర్వీసుల పునరుద్ధరణకు వీలుపడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జియో గ్రేస్ పీరియడ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

గ్రేస్ పీరియడ్ 24 గంటలపాటు యాక్టివ్ లో ఉంటుంది. ఒక్కసారి గ్రేస్ పీరియడ్ ముగిశాక యూజర్లు తమ అకౌంట్స్ ను రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఈ పీరియడ్ లో అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా కేవలం జియో టూ జియోకే నెట్ వర్క్స్ కే పరిమితం. ప్రీపెయిడ్ కస్టమర్స్ ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోయి, రీచార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడనుంది. లో ఇన్ కమ్ వర్కర్స్ కు ప్రీపెయిడ్ ప్యాక్స్ ను ఎక్స్ టెండ్ చేయబోమని ఈమధ్యే జియోతో సహా వొడాఫోన్, ఎయిర్ టెల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే