ఒమిక్రాన్ భయం.. ముంబైలో రెండు రోజులు ఆంక్షలు

ఒమిక్రాన్ భయం..  ముంబైలో రెండు రోజులు ఆంక్షలు

కరోనా కొత్త వేరియెంట్ మహారాష్ట్రను వణికిస్తోంది. ఒమ్రికాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్తలు చేపట్టింది. కొత్త రూపు సంతరించుకున్న మహమ్మారిని నిలువరించేందుకు ముంబై మహానగరంలో శని, ఆదివారాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు ర్యాలీలు, బహిరంగ సభలతో పాటు బయటి వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు గుంపులుగా బయట తిరిగేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహారాష్ట్రలో కొత్తగా 7 కేసులు నమోదవ్వగా అందులో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. వీరితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.  శుక్రవారం ముంబైలో ముగ్గురు ఒమిక్రాన్ బారిన పడగా.. వారు టాంజానియా, యూకే, సౌతాఫ్రికాలోని నైరోబీ నుంచి వచ్చారు. నిన్న పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయింది. శుక్రవారం నమోదైన 7 కేసుల్లో నలుగురు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.