కిలో టమాటా రూ.1000.. ఎక్కడంటే.?

కిలో టమాటా రూ.1000.. ఎక్కడంటే.?

టమాటా లేకుండా చేసే వంటకాలు చాలా తక్కువ. అది ఏ వంటకం అయినా ఒక్క టమాటా వేస్తే చాలు దాని రుచే వేరుగా ఉంటుంది. అలాంటిది బ్రిటన్‭లో టమాట ధరలకు రెక్కలొచ్చాయి. ఏడాది కాలంలో టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది 5 పౌండ్లు ఉన్న కిలో టమాటా ప్రస్తుతం 20 పౌండ్లకు (రూ.1981)కి చేరింది. ఓ వైపు ధరలు పెరిగినా.. మరోవైపు సూపర్ మార్కెట్లలో టమాట కొరత ఏర్పడింది. ముఖ్యంగా టమాటా ధరలు పెరగడం పిజ్జా మార్కెట్ పై ఎఫెక్ట్ పడింది. పిజ్జా, సాస్ తయారీలో ఎక్కువగా టమాటాను వినియోగిస్తుంటారు. టమాటా ధరలు పెరగడంతో.. వ్యాపారులు పిజ్జా ధరలను అమాంతం పెంచేశారు. 

బ్రిటన్ తో పాటు ఇటలీలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కువ ధరలు చెల్లించి టమాటాలు కొనలేక.. కొన్ని రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి స్పెయిన్‌, మొరాకో నుంచి బ్రిటన్‌కు ఎక్కువగా టమాటాలు సరఫరా అవుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టమాటాలకు కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాలు ఎగుమతులను నిలిపివేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రెస్టారంట్ల నిర్వాహకులు దొరికినకాడికి ఏవో నాసిరకమైన టమాటాలను తెప్పించి వాడుతున్నారు. కొందరు నిర్వాహకులు మాత్రం టమాటాలకు బదులు వేరే కూరగాయలతో పిజ్జాలు చేసి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే, వీటిని కస్టమర్లు పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో కొన్ని రెస్టారెంట్లలో పిజ్జాను తమ మెనూ నుంచి తొలగించేస్తున్నారు.