హైదరాబాద్, వెలుగు: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్‌ఏ) ప్రెసిడెంట్ అమిత్ సంఘి ఎన్నికయ్యారు. గురువారం మొహాలీలో జరిగిన ఎన్‌ఆర్‌ఏఐ జనరల్ బాడీ మీటింగ్‌లో నాలుగేండ్ల టర్మ్ కు (2025-–2029) కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సౌత్ రీజియన్ నుంచి కీలకమైన వైస్ ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకున్న తొలి ప్రతినిధిగా అమిత్ నిలిచారు. ప్రెసిడెంట్‌గా కలికేశ్ నారాయణ సింగ్ దేవ్, జనరల్ సెక్రటరీగా పవన్ కుమార్ సింగ్, ట్రెజరర్‌గా శ్రీపాద్ భాంగ్లే ఎన్నికవగా.. టీఆర్‌ఏ వారికి అభినందనలు తెలిపింది.
