
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ఒక్క తూటా కూడా పేలలేదని, ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 విషయంలో అపోజిషన్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కామెంట్స్.. శత్రుదేశానికి అనుకూలంగా మారాయన్నారు. దేశ ఏకీకరణకు సంబంధించిన విషయంలో పార్టీలకతీతంగా కలిసిరాలేరా..? అని ప్రశ్నించారు అమిత్ షా. దాద్రా, నగర్ హవేలీలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.