2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం: అమిత్ షా

2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం అంతం: అమిత్ షా

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 వరకు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామన్నారు.  నక్సలిజం వల్ల దేశంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదన్నారు.  నక్సల్స్ రహిత భారత్‌గా మార్చేందుకు భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయన్నారు. ఈ ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లను హతమార్చడంతో పాటు భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారు..దేశం ఎప్పుడూ వాళ్లకు రుణపడి ఉంటుందన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు తన  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అమిత్ షా.

ALSO READ | భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు..ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్‎గఢ్‎ బీజాపూర్ జిల్లాలో  ఫిబ్రవరి 9( ఆదివారం) న భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో31 మంది మావోయిస్టులు మృతి చెందగా ..మరికొందరికి గాయాలయ్యాయి.  ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన మావోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.