కేబీసీ13లో జయాబచ్చన్‌‌.. బిగ్ బీపై జోకులు

V6 Velugu Posted on Dec 02, 2021

బాలీవుడ్‌‌ బిగ్‌‌బి అమితాబ్‌‌ బచ్చన్‌‌ హోస్ట్‌‌ చేస్తున్న ‘కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి’ (కేబీసీ) సీజన్‌‌ – 13 వెయ్యి ఎపిసోడ్‌‌లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ ఎపిసోడ్‌‌ను గ్రాండ్‌‌గా ప్లాన్‌‌ చేసింది సోనీ టీవీ. అమితాబ్‌‌బచ్చన్‌‌ కూతురు శ్వేతా బచ్చన్‌‌, మనవరాలు నవేలి నందన్‌‌లను కంటెస్టెంట్‌‌లుగా  వచ్చారు. ఈ ఎపిసోడ్‌‌కి స్పెషల్‌‌ అట్రాక్షన్‌‌ జయబచ్చన్‌‌. దానికి సంబంధించి ప్రోమో రిలీజ్‌‌ చేసింది సోనీ. ఆ ప్రోమో చాలా సరదాగా సాగింది. అమితాబ్‌‌, శ్వేత, నవ్యతో వీడియో ద్వారా మాట్లాడిన జయబచ్చన్‌‌.. అమితాబ్‌‌పై జోకులు వేసింది.

“ నేను కాల్‌‌ చేస్తే కనీసం కాల్‌‌ లిఫ్ట్‌‌ చేయడు” అని జయ బచ్చన్‌‌ తన కూతురికి కంప్లైంట్‌‌ చేస్తుంది. దానికి అమితాబ్‌‌ “ ఇంటర్నెట్‌‌ ప్రాబ్లమ్‌‌ అయితే నేనేం చేయాలి” అంటూ సరదాగా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత నవ్య “ మేం పార్లర్‌‌‌‌ నుంచి ఇంటికి రాగానే ‘జయ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు’ అని కాంప్లిమెంట్‌‌ ఇస్తావు కదా.. నువ్వు చెప్పేది నిజమేనా” అని అమితాబ్‌‌ను అడుగుతుంది. దానికి అమితాబ్‌‌ “ జయా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు” అనగానే జయ వెంటనే “ నువ్వు అబద్దం చెప్పేటప్పుడు అస్సలు బాగోవు” అని ఆట పట్టిస్తుంది. 
ఇలా సరదాగా సాగిన ఎపిసోడ్‌‌ ఈ నెల 3న సోనీ ఛానెల్‌‌లో ప్రసారం కానుంది. బిగ్‌‌బి అమితాబ్‌‌ బచ్చన్‌‌ ఈ షోకి దాదాపు 2000 సంవత్సరం నుంచి హోస్ట్‌‌గా ఉన్నారు.   

Tagged Jaya Bachchan, Amitabh Bachchan, KBC 13, sony tv

Latest Videos

Subscribe Now

More News