
ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే కొత్త లుక్స్‌తో ఇంప్రెస్ చేసిన ప్రభాస్ సినిమాపై ఆసక్తిని పెంచాడు. తాజాగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ లుక్‌ను రివీల్ చేస్తూ, ఆయన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఐపీఎల్ మూడ్‌లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపీనెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో ఆయన క్యారెక్టర్‌ను రివీల్ చేశారు.
ఇందులో ఆయన ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా కనిపించనున్నారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టుగా గ్లింప్స్‌లో చూపిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ కథ 3101 బీసీఈలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 ఏడీ కాలల మధ్య ఉంటుందని మేకర్స్ చెప్పారు.
దిశా పటానీ హీరోయిన్‌గా నటించగా, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీడ్ డేట్‌ను ప్రకటించనున్నారు.