బడుల నిర్వహణ ఇక మహిళలదే

బడుల నిర్వహణ ఇక మహిళలదే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ల బలోపేతం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను దీంట్లో భాగస్వా మ్యం చేయాలని డిసైడ్ అయింది. ఈ మేర కు అన్ని బడుల్లో అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో కొత్తగా కమిటీలను వేయ నున్నది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.  గ్రామ, ఏరియా స్థాయిలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలే ఈ కమిటీ చైర్మన్​గా ఉంటారని, మెంబర్ కన్వీనర్​గా స్కూల్ హెడ్మాస్టర్ కొనసాగుతారని వెల్లడించారు.