అంఫాన్‌ ఎఫెక్ట్‌: కోల్‌కతా ఎయిర్‌‌పోర్ట్‌లోకి భారీగా నీరు

అంఫాన్‌ ఎఫెక్ట్‌: కోల్‌కతా ఎయిర్‌‌పోర్ట్‌లోకి భారీగా నీరు
  • మునిగిపోయిన రన్‌వేలు
  • గాలికి ఒకదానికి ఒకటి గుద్దుకున్న కార్లు

కోల్‌కతా: అంఫాన్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. కోల్‌కతా ఎయిర్‌‌పోర్ట్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. రన్‌వేలు, హ్యాంగర్లు నీటిలో మునిగిపోయిన విజువల్స్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌‌పోర్ట్‌లో అన్ని ఆపరేషన్స్‌ను క్యాన్సిల్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. భారీగా వీచిన ఈదురు గాలులకు చెట్లు అన్ని నేలకొరిగాయి. పార్కింగ్‌లో ఉంచిన కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్న విజువల్స్‌ వైరల్‌ అయ్యాయి. భారీ గాలికి ఇంట్లోని కిటికీలు, తలుపులు కూడా విరిగిపోయాయని ఒక వ్యక్తి మీడియాతో చెప్పారు. అంఫన్‌ తుపాను కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించారు. సైక్లోన్‌పై సీఎం మమతా బెనర్జీ సమీక్ష నిర్వహించారు.