
సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలు పాపులర్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు. రీల్స్ కోసం.. లైకుల కోసం జనాలు రక రకాల ట్రిక్కులను ఉపయోగిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. కొందరు రైలు పట్టాలపై విన్యాసాలు చేస్తే, కొందరు బైక్‌లతో ఘోరమైన స్టంట్స్ చేస్తారు. ఇప్పుడు అమ్రోహాకు చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ పంపు వద్ద తన బైక్‌పై పెట్రోల్ పోసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
పెట్రోలు పంపు వద్ద ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల నింపుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో ఇది. బైక్ ట్యాంక్ నిండిపోయి పెట్రోల్ పొంగిపొర్లుతుంది. అయినప్పటికీ అతడు పెట్రోల్ పంప్ ఆఫ్ చేయలేదు.. కంటీన్యూగా పెట్రోల్ పడుతూనే ఉన్నాడు. బైక్ ట్యాంక్ నిండిపోవటం గమనించి పెట్రోల్‌తో ఏకంగా బైక్ కడిగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే యువకులు రీల్‌పై ఎంత పిచ్చిగా ఉన్నారో అర్థమవుతుంది. ఈ సమయంలో ప్రమాదం జరిగితే ఏం జరుగుతుంది? దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు చాలా తెలివి తక్కువ పని చేశాడంటూ అమిత్ అనే ట్విట్టర్ యూజర్ తనను తాను చంపుకుంటానని ఇతరులను కూడా చంపే విధంగా ప్రవర్తించాడని కామెంట్ చేశారు. వకులు రీల్ పూ ఎంత పిచ్చిగా ఉన్నారంటూ @AnadiMisral వ్రాశారు. ఎవరైనా సిగరెట్, బీడి తాగి అక్కడ పడేస్తే జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యలని మరొకరు వ్రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు అమ్రోహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, పంపులోనే పెట్రోల్ వృధా చేసినందుకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Reel के लिए इसने अपनी बाइक को पेट्रोल से नहला दिया। वहां बड़ा हादसा भी हो सकता था।@amrohapolice बढ़िया इलाज कीजिए। pic.twitter.com/IscuE16o9k
— Sachin Gupta (@SachinGuptaUP) July 27, 2023