న్యూఢిల్లీ: యురోపియన్ మార్కెట్లలో కూడా అమూల్ ప్రొడక్ట్‌లు అమ్ముడుకానున్నాయి. యూఎస్‌లో భారీ సక్సెస్ సాధించామని, యూరప్‌లో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని ఈ బ్రాండ్‌ను ఆపరేట్ చేసే గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహాతా అన్నారు. పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా టాప్‌లో ఉందని తెలిపారు. డెయిరీ కేవలం వ్యాపారం మాత్రమే కాదని, గ్రామీణ ప్రాంతాలకు జీవానాధారమని అన్నారు.
బాగా ప్రోటిన్ ఉన్న ఆర్గానిక్ పాలను అమ్మడంపై అమూల్ ఫోకస్ పెట్టిందన్నారు. కాగా, అమూల్ రోజుకి 310 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. ఇండియా మొత్తం మీద ఈ సంస్థకు 107 డెయిరీ ప్లాంట్లు ఉన్నాయి. 50 కి పైగా ప్రొడక్ట్‌లను అమ్ముతోంది. ఏడాదికి 2,200 కోట్ల ప్యాక్‌లను అమ్ముతుండగా, రూ.80 వేల కోట్ల టర్నోవర్ సాధించింది.