బెయిల్ ను నిరాకరించిన ఓ నిందితుడు.. జైలుకే పోతానని వెల్లడి

బెయిల్ ను నిరాకరించిన ఓ నిందితుడు.. జైలుకే పోతానని వెల్లడి
  • ఎయిరిండియా ప్రయాణికుడు

ముంబై: ఇచ్చిన బెయిల్ ను నిరాకరించిన ఓ నిందితుడు జైలుకే పోతానని కోర్టుకు తేల్చి చెప్పాడు. ఇటీవల లండన్~-ముంబై ఎయిరిండియా విమానంలో స్మోకింగ్ చేస్తూ ఇతర ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని పోలీసులు సోమవారం అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం నిందితుడైన రత్నాకర్ ద్వివేదికి కోర్టు రూ. 25 వేల పూచీకత్తుతో  బెయిల్ మంజూరు చేసింది.

అయితే, రూ.25 వేలు కట్టి బెయిల్ తీసుకోవడానికి అతను ఒప్పుకోలేదు. పైగా సంబంధిత సెక్షన్ కింద రూ.250 మాత్రమే ఫైన్ చెల్లించాలని ఇంటర్నెట్ లో ఉందని వాదించాడు. ఆన్‌‌లైన్‌‌లో చూపినంత అమౌంట్ మాత్రమే కడతానని కోర్టుకు తెలిపారు. కావాలంటే.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పాడు. దాంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది.