భూ తగాదాలో విలేకరిపై దాడికి యత్నం

భూ తగాదాలో విలేకరిపై దాడికి యత్నం

కోల్​బెల్ట్, వెలుగు: భూ తగాదాలో ఓ పత్రికా విలేకరి ఇంట్లోకి వెళ్లి దాడికి యత్నించిన బీఆర్ఎస్​కు చెందిన మందమర్రి వైస్  ఎంపీపీ లౌడం రాజ్​కుమార్​ అలియాస్​ సదితో పాటు మరో ముగ్గురిపై మందమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్​ఐ రాజశేఖర్​ తెలిపిన వివరాల ప్రకారం.. వైస్​ ఎంపీపీ లౌడం రాజ్​కుమార్, విలేకరి కొమ్ము రాజేశ్​ మధ్య భూ వివాదం ఉంది. దీనిపై మాట్లాడుకునేందుకు రావాలని రాజేశ్  కోరగా, సోమవారం పొద్దుపోయాక రాడ్​ పట్టుకొని వైస్​ ఎంపీపీ, అతని అనుచరులు ముగ్గురు రాజేశ్​ఇంటికి వెళ్లారు. రాజేశ్  కనిపించకపోవడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాను పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి దాడికి యత్నించారు. తనను చంపాలని ప్రయత్నించిన లౌడం రాజ్​కుమార్, ఎండీ ముజాహిద్, పాలమాకుల భీంసేన్, మేసినేని అరుణ్​లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.