పాక్, అఫ్గాన్​లో భూకంపం.. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

పాక్, అఫ్గాన్​లో భూకంపం.. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

పాక్, అఫ్గాన్​లో భూకంపం

జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

కాబూల్ : అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో ఆదివారం భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్​లోని ఫైజాబాద్ లో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఉదయం 11:19 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ వెల్లడించింది. ఫైజాబాద్ కు 70 కిలోమీటర్ల దూరంలో 220 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఇక పాకిస్తాన్ లో 6.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఆ దేశ సిస్మోలాజీ సెంటర్ చెప్పింది. అఫ్గానిస్తాన్, తజకిస్తాన్ బార్డర్ రీజియన్ లో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.

ఇది 223 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని వివరించింది. భూకంప తీవ్రతకు ఇస్లామాబాద్, పెషావర్, స్వాత్, హరిపూర్, మలకంద్, అబొట్టాబాద్, బత్రాగ్మ్, పీఓకే తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ రెండు దేశాల్లో భూకంపంతో మన దేశంలో భూమి కంపించింది. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో బలమైన ప్రకంపనలు రాగా.. పంజాబ్, హర్యానా, చండీగఢ్ లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.