
హైదరాబాద్: నిరుద్యోగ సమస్య పరిష్కారానికై బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టిన 24 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేయడంలో బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆర్ కేపురం వద్ద హైదరాబాద్ - విజయవాడ రహదారిపై మహేశ్వరం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేని కేసీఆర్ ప్రభుత్వం కిషన్రెడ్డి దీక్షకు భయపడి పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. అరెస్టులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆర్కేపురం కార్పొరేటర్ రాధాధీరజ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.