ఐదేళ్ల కూతురి మీద అత్యాచారం చేసిన కాలేజీ లెక్చరర్

V6 Velugu Posted on Sep 08, 2021

విజయవాడ: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారం చేశాడు.  ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది.  స్థానికంగా నివసించే చినబాబు.. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ మరియ వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీడీగా పనిచేస్తున్నాడు. చినబాబు.. కొన్నేండ్ల కింద ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఐదేళ్ల కూతురు ఉంది. కాగా.. చినబాబు వావి వరుసలు మరిచిపోయి కూతురు మీద కన్నేశాడు. ఇంట్లో భార్య లేని సమయం చూసి.. కూతురు మీద అత్యాచారం చేశాడు. దాంతో పాప అనారోగ్యానికి గురికావడంతో.. విషయం తల్లికి తెలిసింది. భర్త కూతురు మీద అత్యాచారం చేయడంతో ఆ తల్లి భరించలేకపోయింది. స్థానికంగా ఉన్న దిశ పోలీస్ స్టేషన్లో చినబాబు మీద ఫిర్యాదు చేసింది. ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చినబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు వాపస్ తీసుకోవాలని పాప తల్లి మీద నిందితుడి బంధువులు బెదిరింపులకు దిగడం గమనార్హం. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Tagged VIjayawada, Rape, Disha, vikas engineering college, Physical director, pocso case, PD Chinnababu

Latest Videos

Subscribe Now

More News