GT vs MI Eliminator: క్యాచ్ ఒక్కరికి క్రెడిట్ మరొకరికి: సుదర్శన్, కొయెట్జ్ స్టన్నింగ్ ఎఫర్ట్

GT vs MI Eliminator: క్యాచ్ ఒక్కరికి క్రెడిట్ మరొకరికి: సుదర్శన్, కొయెట్జ్ స్టన్నింగ్ ఎఫర్ట్

ఐపీఎల్ 2025లో స్టన్నింగ్ క్యాచ్ నమోదయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో శుక్రవారం (మే 30) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్  ప్లేయర్స్ సాయి సుదర్శన్, కొయెట్జ్ కలిసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. ఇన్నింగ్స్ 8 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. సాయి కిషోర్ వేసిన 8 ఓవర్ రెండో బంతిని జానీ బెయిర్ స్టో రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే పాయింట్ లో ఉన్న సాయి సుదర్శన్ కు బంతి దూరంగా వెళ్తుంది. ఈ దశలో సుదర్శన్ పైకి ఎగిరి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. 

బంతి సాయి సుదర్శన్ చేతికి తగిలి అక్కడే పైకి లేచింది. అప్పటికే సుదర్శన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చిన కొయెట్జ్.. సాయి సుదర్శన్ చేతి నుంచి జారిపడిన క్యాచ్ ను సునాయాసంగా అందుకున్నాడు. ఈ క్యాచ్ ఇన్నింగ్స్ కు హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా గాల్లోకి ఎగిరి సాయి సుదర్శన్ చేసిన ఎఫర్ట్ ను ఎంత పొగిడినా సరిపోదు. ఈ వికెట్ తో గుజరాత్ ఊపిరి పీల్చుకుంది. అప్పటివరకు అద్భుతంగా దంచి కొడుతున్న బెయిర్ స్టో ఔటయ్యాడు. ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ కేవలం 2 బంతుల్లోనే 3 సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. 

►LSO READ | GT vs MI Eliminator: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. ఇరు జట్లలో భారీ మార్పులు

ఈ మ్యాచ్ విషయానికి మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై దుమ్ములేపుతుంది. 13 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ శర్మ (60), తిలక్ వర్మ (0) ఉన్నారు.  బెయిర్ స్టో (47), సూర్య కుమార్ యాదవ్ (33) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ కు రెండు వికెట్లు దక్కాయి.