
హైదరాబాద్, వెలుగు: అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ పరిశ్రమ కోసం అల్యుమెక్స్ ఇండియా 2025 పేరుతో వచ్చే నెల 10 నుంచి 13 వరకు ఢిల్లీలో ఎగ్జిబిషన్, సెమినార్ జరగనుంది. ఈ సందర్భంగా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్‌లపై సెషన్లు, బిజినెస్ మాచింగ్, బయ్యర్-–సెల్లర్ మీట్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో కంపెనీ దేశవిదేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి.
ఈ కార్యక్రమాన్ని అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ తయారీదారుల సంఘం (అలెమయ్) నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అలెమయ్నాయకులు మాట్లాడుతూ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ రంగం భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో తెలుగు రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
2024లో అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ మార్కెట్ విలువ 3.51 బిలియన్ డాలర్లు కాగా,2030 నాటికి ఇది 4.61 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. సగటు వార్షిక వృద్ధి రేటు 4.5శాతం ఉందని, మొత్తం సామర్థ్యం 3 మిలియన్ టన్నులని తెలిపారు. వేడి చేసిన అల్యూమినియంతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడాన్ని అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ అంటారు.