గుడివాడలో ప్రాణాలు తీసిన ఉల్లి

గుడివాడలో ప్రాణాలు తీసిన ఉల్లి

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం జరిగింది. రైతుబజార్లో  ఉల్లికోసం కోసం క్యూ లైన్లో నిలబడ్డ సాంబయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.120కి పైగా పలుకుతుండడంతో సబ్సిడీలో ఉల్లి కిలో రూ.25 కే ఇస్తున్నారు.దీంతో ఉదయం నుంచి గంటన్నర పాటు  లైన్లో నిలబడ్డాడు. ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు డాక్టర్లు.