బాల్క సుమన్ను ఖచ్చితంగా ఓడగొడతం: చెన్నూరు సభలో ఓ నిరుద్యోగి

బాల్క సుమన్ను ఖచ్చితంగా ఓడగొడతం: చెన్నూరు సభలో ఓ నిరుద్యోగి

చెన్నూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖచ్చితంగా ఓడగొడతామంటున్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన సభలో ఓ నిరుద్యోగి స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతూ.. ఈ సారి బాల్క సుమన్ కు ఓటు వేసేది లేదని.. నియోజకవర్గ ప్రజలు ఆయన చేసిందేమి లేదని.. ధాన్యం కొనుగోలుపై కోత పెట్టొద్దని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి నిరుద్యోగుల భవిష్యత్ తో ఆడుకుంటోందని.. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు వదులుకొని వ్యవసాయం చేస్తే.. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

బీఆర్ ఎస్ పాలనలో కౌలు రైతులకు ఒరిగిందేమని లేదన్నారు నిరుద్యోగి భూక్యా  రాజ్ కుమార్.. కౌలు రైతులకు రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. కాళేశ్వరం ముంపుతో అటు రైతులు, కౌలు నిండా మునిగారని.. అప్పాల పాలయ్యారని విమర్శించారు.