ఉప్పల్ నల్లచెరువులో..గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ఉప్పల్ నల్లచెరువులో..గుర్తుతెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్​: ఉప్పల్​పరిధిలోని ఉప్పల్​ నల్ల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ( సెప్టెంబర్​18) ఉదయం ఉప్పల్ నల్లచెరువులో గుర్తు తెలియని శవం ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్​ పోలీసులు శవాన్ని బయటికి తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షాలకు వరద నీటిలో కొట్టుకువచ్చిందా లేక ఆత్మహత్య లేక హత్యా అన్న కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. 

గత రెండు రోజులుగా హైదరాబాద్​ సిటీలో కురుస్తున్న వర్షాలకు నగరమంతా జలమయమయ్యింది.. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది.. బుధవారం రాత్రి కేవలం గంట వ్యవధిలో గరిష్టంగా 15 సెం.మీ. ల వర్షపాతం నమోదు అయ్యింది సిటీ వ్యాప్తంగా దంచికొట్టింది వాన. భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. 

దీంతో ముషీరాబాద్​ లో నాలాలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీటి ప్రవాహంలో బైక్ తో సహా  కొట్టుకుపోయాడు యువకుడు. తాజాగా ఉప్పల్​ నల్లచెరువు లో లభ్యమైన మృతదేహం కూడా వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.