ఎక్స్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేసి డబ్బు సంపాదిస్తున్న క్రియేటర్లకు ఒక అప్డేట్ వచ్చింది. ఇక నుంచి మానిటైజేషన్ కావాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే అంటోంది ఆ కంపెనీ. స్పామ్ కంటెంట్ పబ్లిష్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు. ఇప్పటివరకు వివాదాస్పద లేదా మిస్లీడ్ చేసే పోస్ట్లు, స్పామ్ కామెంట్స్తో వ్యూస్, ఎంగేజ్‌మెంట్‌ను షేర్ చేశారు. వాటి ద్వారా లేదా ఇతర సోర్సెస్ నుంచి డబ్బు సంపాదించారు. అయితే, రాబోయే నెల రోజుల్లో ప్లాట్‌ఫామ్‌పై స్పామింగ్ ద్వారా డబ్బులు రావడం తగ్గిపోతుంది.
ఎక్స్ అల్గారిథం, మానిటైజేషన్ మోడల్స్‌లో మార్పులు చేస్తోంది. దీంతో స్పామ్, క్వాలిటీ లేని కంటెంట్ తగ్గుతుంది. అంతేకాకుండా కంటెంట్ ఫీడ్ బ్యాక్ కోసం కామెంట్ సెక్షన్లో డిస్లైక్ బటన్ కూడా తీసుకొచ్చింది. డిస్‌లైక్స్ సంఖ్య బయటికి కనిపించదు. రిప్లయ్, స్పామ్ లేదా క్వాలిటీ లేని కామెంట్లను అడ్డుకునేందుకు ప్లాట్‌ఫాం అల్గారిథమ్నే ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రాలేదు.
