టీఆర్ఎస్ ఎంపిటీసి భర్త వేధిస్తుండు

టీఆర్ఎస్ ఎంపిటీసి భర్త వేధిస్తుండు

మహబూబాబాద్ జిల్లా: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కలత చెందిన ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జిల్లాలోని గూడూరు మండలం ఊట్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... ఊట్లా గ్రామానికి చెందిన గుగులోతు బాలు భార్యకు అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎంపిటీసీ భర్తకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న బాలు... పద్దతి మార్చుకోవాలంటూ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయితే ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా.. ప్రియుడితో కలిసి భర్తను వేధించడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త బాలు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే గమనించిన స్థానికులు అతడిని వెంటనే మహబూబాబాద్ హాస్పిటల్ కి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలు.. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా.. మాయమాటలు చెప్పి ఎంపిటీసీ భర్త తన భార్యను బుట్టలో వేసుకున్నాడని, అతని మాట వింటూ తన భార్య చిత్రహింసలు పెడుతోందని బాలు వాపోయాడు.  వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి కాపాడాలని పోలీసులను కోరాడు.