ముంబై: ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో యంగ్ ప్లేయర్లు అనాహత్ సింగ్, తన్వి ఖన్నా సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ సింగ్ 3-–0 (11–-2, 11–-6, 11-–4)తో మలేసియాకు చెందిన సెహ్వీత్రా కుమార్‌ను చిత్తుగా ఓడించింది.
మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్ తన్వి ఖన్నా 3–-1 (11-–6, 7–-11, 11-–5, 11–-8) తేడాతో నాలుగో సీడ్ ఐనా అమాని (మలేసియా)కు షాకిచ్చి సంచలనం సృష్టించింది. సెమీఫైనల్లో అనాహత్ , తన్వి తలపడనున్నారు. కానీ, మరో మ్యాచ్‌లో లోకల్ ఫేవరెట్ జోష్న చిన్నప్ప 1–-3 (8–-11, 11-–8, 6-–11, 1-–11) తేడాతో ఈజిప్టు ప్లేయర్ నదీన్ ఎల్ హమ్మమీ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.
