పాలమూరు మున్సిపల్  చైర్మన్​గా ఆనంద్​ కుమార్

పాలమూరు మున్సిపల్  చైర్మన్​గా ఆనంద్​ కుమార్
  •     వైస్ చైర్మన్ గా షబ్బీర్ అలీ

పాలమూరు వెలుగు. మహబూబ్​గర్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఆనంద్​ ఎన్నికయ్యారు.  గత నెల 27న  మాజీ మున్సిపల్ చైర్మన్ కోరమని నరసింహులు,  వైస్ చైర్మన్ తాటి గణేశ్​పై  అవిశ్వాసం పెట్టింది. ఈ అవిశ్వాసంలో  కాంగ్రెస్ కు కార్పొరేటర్లు మద్దతు ప్రకటించారు.  దీంతో సోమవారం కాంగ్రెస్​ పార్టీ నుంచి చైర్మన్​గా ఆనంద్​ కుమార్​ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.   వైస్ చైర్మన్ పదవికి ముగ్గురు కౌన్సిలర్లు  పోటీ పడగా.. షబ్బీర్​ అలీవైపు మెజార్టీ సభ్యులు మద్దతు పలికారు.