తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్​గా ఆనంద్​ మహీంద్ర

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్​గా ఆనంద్​ మహీంద్ర
  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్  

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి చైర్​పర్సన్​గా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్​ ఆనంద్​ మహీంద్రాను రాష్ట్ర సర్కారు నియమించింది. ఈ మేరకు గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో  పేర్కొంది. కో చైర్మన్​గా విద్యావేత్త శ్రీనివాస్​ సి. రాజును నియమించింది. ఆయన కూడా ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, కొన్నాళ్ల క్రితం సీఎం రేవంత్​ రెడ్డి.. ఆనంద్​ మహీంద్రతో సమావేశమయ్యారు. యువతలో నైపుణ్యాలను పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లుకూ ఆమోదం లభించింది.