గ్రేట్.. ఈ వీడియో చూస్తే మీకు కన్నీళ్లు ఆగవు

గ్రేట్.. ఈ వీడియో చూస్తే మీకు కన్నీళ్లు ఆగవు

స్ఫూర్తి కలిగించే విషయాలు చెబుతూ ఎప్పుటూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటుంటారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. లేటెస్ట్ గా ఆయన చేసిన ఓ ట్వీట్ కోట్లాది మందిని కంటతడిపెట్టిస్తోంది.

వీడియోలో ఓ చిన్న పిల్లాడు కుర్చీలో కూర్చుని ఉంటాడు. అతడికి రెండు చేతులు ఉండవు. కాళ్లతోనే ఎదురుగా ఉన్న ప్లేట్ లోని ఆహారాన్ని స్పూన్ తో తీసుకుని తినడానికి ట్రై చేస్తాడు. కుదరకపోయేసరికి.. మరో కాలివేళ్లతో స్పూన్ సవరించి మళ్లీ ప్రయత్నించి.. ఆహారం నోటికి అందించుకుంటాడు. 17 సెకన్ల వీడియోనే కానీ… ఆ వీడియో ఇచ్చే స్ఫూర్తి వేరు. వీడియోను మళ్లీ మళ్లీ చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదంటున్నారు ఇంటర్నెట్ యూజర్స్. అంత చిన్న పిల్లోడు… అంత కష్టాన్ని కూడా కాదని… కాళ్ల పాదాల వేళ్ల సాయంతో సులువుగా తాను అనుకున్న పని(తినడం)ని చేసేస్తాడు. ఈ వీడియో చూస్తుంటే కలిగే ఫీలే వేరు అంటూ స్పందిస్తున్నారు.

వీడియోను పోస్ట్ చేస్తూ… మనసును తాకే మాటలు చెప్పారు ఆనంద్ మహీంద్రా. “ఇటీవలే నా మనవడిని చూశా. అందుకే ఈ వాట్సాప్ పోస్ట్ చూసినప్పుడు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా. లోపాలు & సవాళ్లు ఏమైనప్పటికీ.. జీవితం అనేది ఓ బహుమతి. దాన్ని ఎలా తయారుచేసుకుంటున్నామన్నదే మనపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వీడియోలు.. నేను కోల్పోయిన స్థైర్యాన్ని, ఆశావాదాన్ని మళ్లీ నిలుపుకోవడంలో సహాయపడుతుంటాయి” అన్నారు ఆనంద్ మహీంద్రా.

ఈ ట్వీట్ కింద.. మరెన్నో స్ఫూర్తిమంతమైన ఫొటోలు, వీడియోలను నెటిజన్స్ షేర్ చేశారు. సామర్థ్యం అనేది.. వైకల్యాన్ని దూరం చేస్తుందని అన్నారు.

ఈ వీడియోలో  ఉన్న రెండు చేతులు లేని స్టూడెంట్ ను చూడండి. మధ్యాహ్న భోజనాన్ని టిఫిన్ బాక్స్ లో తీసుకుని.. వెళ్లి లైన్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత.. తన మోచేతులు, తల సహాయంతో బాక్స్ లో ఉన్న అన్నాన్ని తీసుకుని..మరో మోచేయి సాయంతో దాన్ని నోటికి అందించుకుని తింటున్నాడు. ఈ వీడియో .. రెండు చేతులు సక్రమంగానే ఉన్నా.. ఏమీ చేయలేకపోతున్నామని నిరాశావాదంతో ఉండిపోతున్న వారికి ఓ పాఠం లాంటిదే. కాదంటారా.. మీరే చూడండి.