
ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటిస్తూ.. మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ ‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంకరేజ్ చేసిన నన్ను.. హీరోగానూ ఆదరిస్తారని నమ్ముతున్నా. సినిమా నా ప్రాణం. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’ అని చెప్పాడు. ‘ఈ సినిమాలో మా హీరో ఆరు నెలలు కంటిన్యూస్‌గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది’ అన్నాడు ప్రసన్న కుమార్. ఇది చాలా స్పెషల్ మూవీ అన్నారు హీరోయిన్స్ రోషిణి, నవమి. అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు