ఘనంగా అనంత పద్మనాభస్వామి వ్రతాలు

ఘనంగా అనంత పద్మనాభస్వామి వ్రతాలు

సుల్తానాబాద్, వెలుగు: నీరుకుళ్ల గ్రామంలోని భూనీలా సమేత శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో శనివారం భక్తులు అనంతపద్మనాభ స్వామి వ్రతాలు ఆచరించారు. స్వామివారిని పోలినట్లు మానేరు తీరంలో శ్రీ రంగనాయక స్వామి విగ్రహం ఉంది.  వ్రతాలు చేసేందుకు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నోముల అనంతరం ప్రతిమల్లో కోటి వత్తులు వెలిగించి స్వామివారికి హారతిగా సమర్పించారు. వ్రతాల్లో 125 జంటలు పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో శంకర్, మాజీ సర్పంచ్ విజేందర్, పాల్గొన్నారు.

వైభవంగా అనంత పద్మనాభస్వామి వ్రతం

వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దంపతులు అనంత కోటి దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు.