వైద్య రంగంలో ‘అనస్థీషియా’ కీలకం

వైద్య రంగంలో ‘అనస్థీషియా’ కీలకం

మాదాపూర్, వెలుగు: వైద్యరంగంలో అనస్థీషియా విభాగం అత్యంత ముఖ్యమైనదని మెడికవర్​ అనస్థీషియాలజీ హెడ్​ డాక్టర్​ రామకృష్ణ అన్నారు. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా గురువారం మాదాపూర్​ మెడికవర్​ హాస్పిటల్​లో వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, సిబ్బందితో కలిసి కేక్​ కట్​ చేశారు. 1846లో మొదటిసారి శస్త్రచికిత్సలో ఈథర్ అనస్థీషియా ఉపయోగించారని, ఈ ఆవిష్కరణతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. చిన్న శస్త్రచికిత్సల నుంచి గుండె, మెదడు, క్యాన్సర్ వంటి పెద్ద ఆపరేషన్ల వరకు రోగికి నొప్పి, భయం లేకుండా చికిత్స పొందేలా చేయడం అనస్థీషియాలజిస్టుల స్పెషాలిటీ అన్నారు.