
టెలివిజన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొని సిల్వర్ స్ర్కీన్‌లో అవకాశాలు అందుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి కూడా ఉంది. ఇంతకుముందు చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. ప్రస్తుతం తన స్మాల్ స్క్రీన్ చరిష్మాతో మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీముఖి. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్లో ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. మెగాస్టార్‌కి వీరాభిమాని అవడంతో.. ఆయన సినిమాలో నటించడం హ్యాపీగా ఉందంటోంది ఈ యాంకర్. త్వరలో రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ ‘భోళా శంకర్’లోనే శ్రీముఖి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మి కూడా ఓ స్పెషల్ సాంగ్‌కి కన్ఫార్మ్ అయింది. అలాగే బిగ్‌బాస్– 5 ఫేమ్ మానస్ కూడా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ‘చి. ల. సౌ రాంబాబు’ పేరుతో రాబోతున్న ఈ సిరీస్ ఏ ప్లాట్‌ఫాంలో రిలీజ్ అవ్వబోతుందన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.