ట్రోల్ చేసేముందు ఆలోచించండి: సుమ

ట్రోల్ చేసేముందు ఆలోచించండి: సుమ

సినిమా, టీవీ, రాజకీయం, క్రీడలు సహావివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంచాలా సాధారణ విషయం అనేక సందర్భాల్లో ఈ ట్రోలింగ్ తో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సార్లు సెలబ్రిటీలు ట్రోలింగ్స్ పై స్పందిస్తుంటారు. తెలుగు టీవీ యాంకర్ సుమ ఇటీవల ట్రోల్స్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో నెగెటివిటీ, ట్రోల్ చేసే సంస్కృతి ఇటీవల పెరిగిపోయింది. కొందరు ఇతరులను ట్రోలింగ్ కు గురిచేసి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికైనా వ్యతిరేకంగా ట్రోల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ట్రోలింగ్ చేసే వాళ్లు తమ సొంత వివరాల్ని బయటపెట్టుకోలేరు. ట్రోలింగ్ లో ఎలాంటి సరదా లేదనే విషయాన్ని గుర్తించాలి’ అని సుమ అభిప్రాయ పడ్డారు.అలాగే నేటి తరంలో యాంకర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఎన్నోఅవకాశాలున్నాయని అభిప్రాయ పడ్డారు.సుమ ఇటీవలే ‘స్టార్ మా’ టీవీలోకి ‘భలేచాన్స్ లే’ షోతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. సుమ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు.