యాంకర్ సుమ అరెస్ట్!.. ఏం జరిగిందంటే..

యాంకర్ సుమ అరెస్ట్!.. ఏం జరిగిందంటే..

యాంకర్ సుమ అంటే తెలియని వారుండరు. ఓ పక్క టీవీ షోస్, సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొంటూనే.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. పుట్టింది కేరళలోనే అయినా తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు అనతికాలంలోనే మరింత చేరువయ్యారు. అయితే తాజాగా ఆమెను అరెస్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో కూడా నెటింట్లో వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేమైంది..? ఆమెనెందుకు అరెస్టు చేస్తారు..? అంటూ భిన్న ప్రశ్నలతో తెగ అయోమయంలో పడ్డారు.

వైరల్ అవుతోన్న ఈ ఫొటోలో సుమ చేతికి బేడీలు వేసి, కారులో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫొటోపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తు్న్నారు. ఈ ఫొటో టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగమని ముందు కొందరు అనుమానించినా.. తాజాగా ఆ మిస్టరీ ఏంటో ఎట్టకేలకు బయటపడింది. అది రీసెంట్ గా హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా ప్రమోషన్స్ కోసమని తేటతెల్లం అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సుమ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఆమె ఈ తరహా డ్రామా ప్లే చేసిందా అని కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/Shine_Screens/status/1646118640750837765