రామమందిరం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం, స్తంభాలు

రామమందిరం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం, స్తంభాలు

అయోధ్య : అయోధ్య లోని రామ జన్మభూమి ఆలయం నిర్మించే స్థలంలో ప్రాచీన శివలింగం, ఇసుక స్తంభాలు, పిల్లర్లు గుర్తించారు. ఆలయ నిర్మాణ పనుల కోసం పది రోజులుగా ఇక్కడ ల్యాండ్ లెవలింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా పురాతన విగ్రహాలు, స్తంభాలు బయటపడుతున్నాయి. తాజాగా శివలింగం సహా పిల్లర్లు, ఇసుక స్తంభాలు గుర్తించిట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. “ల్యాండ్ లెవలింగ్ పనుల్లో భాగంగా తవ్వకాల్లో 5 అడుగుల శివలింగం, 7 బ్లాక్ స్టోన్ తోనే ఉన్న స్తంభాలు, 6 ఇసుక స్తంభాలు బయటపడ్డాయి ” అని అన్నారు. వీటిని అర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారికి అప్పగించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్ష్తేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. మే 11 నుంచి ఆలయ నిర్మాణ మొదటి దశ పనులను ప్రారంభించారు. పది రోజులుగా పలు పురాతన వస్తువులు బయటపడుతున్నాయని వీహెచ్ పీ అధికార ప్రతినిది వినోద్ బన్సాల్ తెలిపారు. రాతితో చేసిన పువ్వులు, కలాష్, అమలాక్, డోర్జాంబ్ లాంటి పురాతన వస్తువులు దొరికట్లు తెలిపారు.