కామినీ చెరువు గుట్టల్లో ప్రాచీన సమాధులు

కామినీ చెరువు గుట్టల్లో ప్రాచీన సమాధులు

చారిత్రక ఆనవాళ్లైన ప్రాచీన సమాధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడ్డాయి. వెంకటాపురం మండలం కామినీ చెరువు గుట్టల్లో రాతి యుగం నాటి జాడలు చరిత్రకారులు కొండవీటి గోపి, జగన్మోహన్‍రావు, శేషు కనుగొన్నారు. ‘వీటిని ప్రస్తుతం రాకాసి గూళ్లు అని పిలుస్తున్నారు. నాలుగువైపులా బలమైన ఆధారాలుగా రాళ్లను పేర్చి వాటి పైకప్పులా పెద్ద రాయి అమర్చి ఉన్న ఈ నిర్మాణాలను ‘డోలమెన్స్’అంటారు. అయితే అవి టూంబ్సా..? లేక జ్ఞాపక చిహ్నాలా..? అనేది తెలియాల్సి ఉంది’ అని చెబుతున్నారు. గుంత సమాధులు, గూడు సమాధులు, గది సమాధులు, గుహ సమాధుల కంటే ముందు రాతియుగం నాటి సమాధులు అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి రాతి నిర్మాల కింద మట్టి పాత్రల్లో అస్థికలు ఉంచేవారని, కాలగర్భంలో ఆ అస్థికలు ప్రకృతిలో కలిసి పోయుంటాయని ఆర్కియాలజీ సైంటిస్టులు చెప్పినట్లుగా గుర్తుచేశారు.