WCL 2025: ఒకే ఓవర్‌లో 12 వైడ్‌లు, నో-బాల్.. 18 బంతులు వేసిన పూర్తి కాలేదు

WCL 2025: ఒకే ఓవర్‌లో 12 వైడ్‌లు, నో-బాల్.. 18 బంతులు వేసిన పూర్తి కాలేదు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సీజన్‌లో అత్యంత చెత్త రికార్డ్ చోటు చేసుకుంది. మంగళవారం (జూలై 29) పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్ తన లైన్ అండ్ లెంగ్త్‌లో పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా తన తొలి ఓవర్ లోనే ఏకంగా 18 బంతులు వేశాడు. వీటిలో 12 వైడ్ బాల్స్ తో పాటు ఒక నో బాల్ ఉండడం షాకింగ్ గా మారుతోంది. 18 బంతులు వేసిన ఓవర్ పూర్తి కాకపోవడం విశేషం. 5 బంతులు మాత్రమే లీగల్ డెలివరీస్ వేశాడు. అప్పటికే పాకిస్థాన్ మ్యాచ్ గెలవడంతో హేస్టింగ్స్ కు ఆరో బాల్ వేసే అవకాశం రాలేదు.  

18 బంతులు వేసిన ఓవర్ పూర్తి కాకపోవడం విశేషం. 5 బంతులు మాత్రమే లీగల్ డెలివరీస్ వేశాడు. అప్పటికే పాకిస్థాన్ మ్యాచ్ గెలవడంతో హేస్టింగ్స్ కు ఆరో బాల్ వేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్ ఛాంపియన్స్ ఛేజింగ్ లో తొలి ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఈ దశలో పాక్ విజయాన్ని హేస్టింగ్ మరింత ఈజీ చేశాడు. ఎనిమిదో ఓవర్లో కెప్టెన్ బ్రెట్ లీ హేస్టింగ్ కు బౌలింగ్ ఇచ్చాడు. ఈ ఓవర్ లో ఈ ఆసీస్ పేసర్ వరుస ఐదు  వైడ్‌లతో ప్రారంభించాడు. వరుసగా రెండు లీగల్ డెలివరీలు వేసిన తర్వాత.. ఒక నో-బాల్ వేశాడు. ఆ తర్వాత మరో వైడ్ తో పాటు డాట్ వేశాడు. చివర్లో వరుసగా ఐదు వైడ్ లు వేయడంతో పాకిస్థాన్ మ్యాచ్ గెలిచింది. 

►ALSO READ | Moeen Ali: 2019లోనే కోహ్లీని తప్పించి అతడికి RCB కెప్టెన్సీ ఇవ్వాలనుకున్నారు: మొయిన్ అలీ

ఓవరాల్ గా ఐదు లీగల్ డెలివరీస్ లో ఒక ఫోర్, మూడు  సింగిల్స్ తో పాటు ఒక డాట్ బాల్ ఉంది. హేస్టింగ్స్ బౌలింగ్ కు బౌండరీ దగ్గర బ్రెట్ లీ, క్రిస్ లిన్ కు ఏం చేయాలో అర్ధం కాక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ 11.5 ఓవర్లలో కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది. నాలుగో స్థానంలో నిలిచిన బెన్ డంక్ 14 బంతుల్లో కేవలం 26 పరుగులతో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఛాంపియన్స్ ఓపెనర్లు షార్జీల్ ఖాన్ (23 బంతుల్లో 32*) మరియు సోహైబ్ మక్సూద్ (26 బంతుల్లో 28*) ధాటిగా ఆడడంతో మరో 73 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.