కరెంటు బిల్లు ఉంటే చాలు.. ఇంట్లో నుంచే ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు..

  కరెంటు బిల్లు ఉంటే చాలు.. ఇంట్లో నుంచే ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు..

మీరు కొత్తగా ఇల్లు మారారా లేదా వేరే చోటుకి వెళ్ళారా... లేక మీ ఆధార్ అడ్రస్ అప్ డేట్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్... ఇప్పుడు  మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఇంకా ఫోన్ నంబర్ మార్చుకోవడం చాలా ఈజీ కానుంది. ఇందుకు ఆధార్ సెంటరుకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో కూర్చొని హాయిగా ఆన్‌లైన్‌లో అప్ డేట్ చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వీలు కల్పిస్తుంది.

అంటే నవంబర్ 2025 నుండి ఆధార్ వినియోగదారుల టైం వెస్ట్ కాకుండా, పేపర్లతో  పనిలేకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే UIDAI మీ గుర్తింపును వెరిఫై చేయడానికి పాన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ వంటి ప్రభుత్వం జారీ చేసినవి ఇస్తే చాలు. 

ఒకవేళ మీరు కొత్త చోటుకి రెంట్ ఇంట్లో ఉన్నట్లయితే కరెంట్ బిల్లు వంటివి అడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వొచ్చు. దింతో రెంట్ అగ్రిమెంట్ లేదా పాస్‌పోర్ట్ వంటివి లేకపోయినా కూడా మీ అడ్రస్ అప్ డేట్ చేసుకోవచ్చు. 

  UIDAI ఆధార్‌ను మరింత డిజిటల్-ఫ్రెండ్లీగా మార్చేందుకు  కొత్త మొబైల్ యాప్‌ను కూడా తీసుకొస్తుంది.  ఈ యాప్  డిజిటల్ వెర్షన్‌గా  QR కోడ్‌తో ఉంటుంది. అంటే ఇక ఆధార్ జిరాక్స్ లేదా ఆధార్ ఫోటోలు ప్రతిసారి మీతో తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.  మీరు KYC లేదా వెరిఫికేషన్ కోసం మీ ఆధార్‌ షేర్ చేయాల్సి వచ్చినా మాస్క్డ్ ఫార్మాట్‌లో పంపొచ్చు. 

ఒకవేళ మీరు మీ అడ్రసును మాత్రమే అప్‌డేట్ చేసుకోవాలంటే 14 జూన్  2026 వరకు myAadhaar పోర్టల్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. OTP వెరిఫికేషన్ తప్పనిసరి కాబట్టి, మీ ఆధార్ మీ మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలి.