
ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Redmi ఇండియన్ మార్కెట్‌లో Note 14 Pro Max 5Gని జస్ట్ రూ.12,999తో ఎవరు ఊహించని ధరకు లాంచ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ సాధారణంగా ఇతర బ్రాండ్లతో పోల్చితే 30 వేలకి పైనే ఉంటుంది. అయితే Redmi మార్కెట్‌లో ఇతర స్మార్ట్ ఫోన్స్ హై-ఎండ్ ఫీచర్స్ ని ఇంత తక్కువ ధరతో లేటెస్ట్ టెక్నాలజీని సామాన్యుడికి అందించడానికి తీసుకొచ్చింది.
కెమెరా టెక్నాలజీ: Redmi Note 14 Pro Max 5G 200-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సిస్టం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ అల్ట్రా-హై-రిజల్యూషన్ సెన్సార్ కెమెరా AI టెక్నాలజీతో ఉంటుంది, అంతేకాదు పరిస్థితుల ఆధారంగా ఇమేజ్ సెట్టింగ్‌లను ఆటోమేటిక్గ ఆప్టిమైజ్ చేస్తుంది, లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే నైట్ టైం లేదా తక్కువ వెలుతురు ఉన్న కూడా క్లియర్ ఫోటోగ్రఫీ అందిస్తుంది. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ, ల్యాండ్‌స్కేప్ షాట్స్, అల్ట్రా-వైడ్ యాంగిల్, 4K వీడియో రికార్డింగ్ వంటి మల్టి మోడ్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూస్తే 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్ కి మంచి క్వాలిటీ అందిస్తుంది.
రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ: దీనిలో ఉన్న 8000mAh బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ తొలగిస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ తో రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ కారణంగా ప్రతిసారి ఛార్జింగ్ పెట్టాల్సిన ఆవసరం ఉండదు. 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో గంటలోపే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఫ్యూచర్ కనెక్టివిటీ: ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని నెట్‌వర్క్ బ్యాండ్‌లతో 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్ ప్రాసెసర్, 12GB RAM,మల్టీ టాస్కింగ్ దీనిలో చూడొచ్చు. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 14 MIUI, మెమరీ కార్డు ఫీచర్ కూడా ఉంది.
లేటెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ: 120Hz రిఫ్రెష్ రేట్ టెక్నాలజీతో 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, టచ్ ఇంటరాక్షన్‌లు, ప్రీమియం డిజైన్‌లో మిడ్‌నైట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, అరోరా గ్రీన్ వంటి కలర్ అప్షన్స్ ఉన్నాయి.