పిల్లలకు గుండు సున్నానే: ఇంగ్లీష్ టీచర్.. ఐదేళ్ల అనుభవం.. 11 అని ఇంగ్లీష్‎లో రాయటం రాలేదు

పిల్లలకు గుండు సున్నానే: ఇంగ్లీష్ టీచర్.. ఐదేళ్ల అనుభవం.. 11 అని ఇంగ్లీష్‎లో రాయటం రాలేదు

రాయ్‎పూర్: ప్రస్తుతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా కీలకంగా మారింది. విదేశాలకు వెళ్లాలన్న, జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లిన ఇంగ్లీస్ మస్ట్ అయిపోయింది. ఇంగ్లీష్ రాకుంటే జాబ్ కష్టమే అనే పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంగ్లీష్‎తోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. మాతృ భాషతో పాటు ఆంగ్లం నేర్చుకోవడం చాలా ముఖ్యమని పలువురు రాజకీయ నాయకులు కూడా తరుచూ చెబుతున్నారు. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్‎ను గుర్తించి ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీ్ష్ మీడియంలో కూడా క్లాసులు చెబుతున్నారు. 

అయితే, వేలకు వేలు జీతం తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఇంగ్లీ్ష్ టీచర్లకు కనీన అర్హతలు ఉండటం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు ఎంతో కీలకమైన ఇంగ్లీష్ బోధించే అధ్యాపకులకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు. ఇలాంటి ఉపాధ్యాయులతో పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఛత్తీస్‎గఢ్‎లో చోటు చేసుకుంది. ఇంగ్లీష్ బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కనీసం ELEVEN (11) స్పెల్లింగ్ కరెక్ట్‎గా రాయరాకపోవడం, చూసుకుంటూ చదవలేకపోవడం చూసి అధికారులు ఖంగుతిన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా సురేంద్ర దీక్షిత్ అనే ఇంగ్లీష్  టీచర్ చెబుతోన్న క్లాసులోకి వెళ్లారు అధికారులు. ఇంగ్లీష్  బేసిక్ వర్డ్స్ బోర్డుపై తప్పుగా రాసి ఉండటం గమనించిన అధికారులు.. సదరు ఉపాధ్యాయుడిని బోర్డుపై ELEVEN (11), NINETEEN (19) స్పెల్లింగ్ రాయమని చెప్పారు. ELEVEN  స్పెల్లింగ్‎ను ALAVEN అని తప్పుగా రాశాడు టీచర్. పోనీ దానిని చదవమనగా లెవన్‎ను‘ఐవేనే’ అని ఉచ్చరించాడు. 

బోర్డుపై రాసిన, చదవినా స్పెల్లింగ్ కరెక్టేనా అని అధికారులు మరోసారి అడిగారు. సదరు ఉపాధ్యాయుడు చాలా కాన్ఫిడెంట్‎గా కరెక్ట్ ననే సమాధానమిచ్చాడు. ఇంగ్లీష్ టీచర్ అయ్యిండి కనీసం ELEVEN స్పెల్లింగ్ రాయలేకపోవడం, సరిగ్గా పలకలేకపోవడం చూసి ఇన్స్పెక్షన్‎కు వచ్చిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ELEVEN స్పెల్లింగ్ రాని వ్యక్తి ఇంగ్లీష్ బోధిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలని ఆందోళన వ్యక్త చేస్తున్నారు.  ఇలాంటి టీచర్లుంటే పిల్లలకు ఇంగ్లీష్ లో గుండు సున్నానే అని కామెంట్స్ చేస్తున్నారు.