ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..?

ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..?

జూలై21న సాయంత్రం 5 గంటలకు ఏం జరిగింది..? ఆ టైంలోనే జగదీప్ ధంఖర్ నిష్క్రమణకు ముహూర్తం పెట్టారా?..దంఖర్ రాజీనామా వెనక పెద్ద కథే ఉందన్నది ఉత్త ప్రచారమేనా.. నిజంగానే ఏదైన గూడుపుఠాని జరిగిందా..? జగదీప్ ధంఖర్ ఉపరాష్ట్రపతి పదవికి, రాజ్యసభ్య చైర్మన్ పదవికి రాజీనామా చేయడం వెనక ఆరోగ్య కారణాలు అని అధికారికంగా వినిపిస్తున్నా.. ఆయన ఆకస్మిక నిష్క్రమణ వెనక అనేక రాజకీయ పరిణామాలున్నాయని చర్చలే చర్చలు కొనసాగుతున్నాయి. దంఖర్ రాజీనామాకు దారితీసిన కారణాలేంటీ?..

ప్రతిపక్షాల అభిశంసన తీర్మానం,ప్రభుత్వ వైఖరి..

జస్టిస్ వర్మపై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును జగదీప్ ధంఖర్ స్వీకరించడం ఒక ముఖ్యమైన మలుపుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉందట.  ప్రభుత్వం ఈ అంశాన్ని లోక్‌సభలో ముందుగా లేవనెత్తాలని భావించిందని..అయితే ధంఖర్ రాజ్యసభలో దీనిని ప్రస్తావించడం ప్రభుత్వ వ్యూహానికి విరుద్ధంగా ఉందని ఎన్డీయే ప్రభుత్వంలో పెద్దలు గుర్రుగా ఉన్నారట. 

ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని..ఈ విషయం తెలుసుకున్న ధంఖర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే అది తిరస్కరణకు గురైంది.

బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో సంఘటనలు..

జూలై 21 ఉదయం BAC సమావేశంలో ధంఖర్ ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని ఎప్పుడు మాట్లాడుతారో ప్రభుత్వాన్ని అడగమని మంత్రులను కోరడం ద్వారా వివాదం మొదలైంది. ఇది మంత్రులకు ఆశ్చర్యం కలిగించిందట. ప్రధాని సభలో ఎప్పుడు మాట్లాడాలో ఛైర్మన్ లేదా ప్రతిపక్షం నిర్ణయించాలి కదా.. ధంఖర్ ఎలా నిర్ణయిస్తారని అసంతృప్తితో ఉన్నారట. 

►ALSO READ | భారత్ దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది :ప్రధాని మోదీ

సాయంత్రం 4:30 గంటలకు రెండవ BAC సమావేశానికి ప్రభుత్వ ప్రతినిధులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు వంటి సీనియర్ మంత్రులు హాజరుకాకపోవడం ధంఖర్‌ను అవమానపరచిందని..ఇది ఆయన రాజీనామాకు ఒక కారణం అయి ఉండవచ్చని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వంటి వారు చెబుతున్నారు. సమాచారం ఇవ్వకుండా గైర్హాజరు కావడం ధంఖర్‌ను ఆగ్రహానికి గురిచేసిందని అంటున్నారు. 

ఎన్‌డీఏ ఎంపీల చర్యలు..

ధన్‌ఖర్‌పై తొలగింపు తీర్మానంపై NDA ఎంపీలు సంతకాలు సేకరించడం..దానికి 134 మంది ఎంపీల మద్దతు ఉందని చెప్పడం..అలాగే ఈ అంశాన్ని అదే రోజు ముగించాలని ప్రభుత్వం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇది ధంఖర్ రాజీనామా చేసేలా పురిగొల్పాయని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను సీల్డ్ కవరులో రాజ్యసభ సెక్రటేరియట్‌కు న్యాయ మంత్రి సమర్పించడం, ధంఖర్ రాజీనామాకు కేవలం పది నిమిషాల ముందు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ప్రతిపక్షాల విమర్శలు,అనుమానాలు..

ధంఖర్ రాజీనామా వెనుక ఆరోగ్య కారణాలకంటే మరింత లోతైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా జైరాం రమేష్, బహిరంగంగా చెప్పారు. ప్రధాని  మోదీ నాన్-పోస్ట్ కూడా ఈ రహస్యాన్ని పెంచిందని రమేష్ విమర్శించారు.

కాంగ్రెస్ బలవంతపు రాజీనామా అని అంటుండగా TMC నేత కళ్యాణ్ బెనర్జీ అయితే మోడీ ప్రభుత్వం ,ఇతర క్యాబినెట్ మంత్రులు ధంఖర్‌ను బలవంతంగా రాజీనామా చేయించారని లేకుంటే అభిశంసన తీర్మానం ఎదుర్కొంటారని బెదిరించారని ఆరోపించారు. ధంఖర్‌ను "కిసాన్ పుత్ర"గా పొగడటంతో ధంఖర్ కు గౌరవప్రదమైన వీడ్కోలు కూడా ఎన్డీయే ప్రభుతవం నిరాకరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

దంఖర్ స్వభావం,ప్రభుత్వంతో సంబంధాలు..

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఆయనకు అనేక వివాదాలు ఉండటం, అలాగే రాజ్యసభ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలతో ఆయనకు తరచుగా ఘర్షణలు జరగడం వంటివి ఆయన దృఢమైన స్వభావానికి ఓ ఉదాహరణ. ప్రభుత్వం ,ప్రతిపక్షం మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ, నియమాలు ,ప్రోటోకాల్‌లను పాటించాలని కోరుకునే వ్యక్తిగా ధంఖర్‌ను కొంతమంది నాయకులు అంటుంటారు. ఈ విషయంలో ప్రభుత్వంతో ఆయనకు విభేదాలు వచ్చి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

మొత్తంగా జగదీప్ ధంఖర్ రాజీనామా ఆరోగ్య కారణాలు అని అధికారికంగా పేర్కొన్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు, సంఘటనలు ఆయన నిష్క్రమణ వెనుక బలమైన రాజకీయ కారణాలుగా అని తెలుస్తోంది.