
భారత్ దాడులతో నే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 22 న పహల్గాం దాడి తర్వాత 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు ప్రధాని మోదీ. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నిచ్చాం.. ఎక్కడ , ఎలా వ్యవహరించాలో తేల్చుకోవాలని సైన్యానికి చెప్పామన్నారు.
భారత్ దెబ్బకు పాక్ ఎయిర్ బేస్ ఇప్పటికీ ICU ఉందనన్నారు ప్రధాని మోదీ. భారత్ తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులు పాక్ ను కూల్చాయన్నారు మోదీ. గతంలో దాడులు చేసి ఉగ్రవాదులు ప్రశాంతంగా నిద్రపోయేవారు.. ఇప్పుడు దాడులు చేయాలంటేనే ఉగ్రవాదులకు చెమటలు పడుతున్నాయన్నారు.
భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు ఏ దేశమూ అడ్డు చెప్పలేదు. ఏ దేశాధినేత యుద్దం ఆపాలని చెప్పలేదు.. దాడులు ఆపాలని పాక్ గగ్గోలు పెట్టింది.. యూఎస్ అధ్యక్షుడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే నేను అందుబాటులో లేనని చెప్పారు ప్రధాని మోదీ. చాలా సమయం తర్వాత స్పందించాను.. పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేను అప్పుడు హెచ్చరించానన్నారు మోదీ.
ఆపరేషన్ సింధూర్ ను 193 దేశాలు సమర్థించాయి.. కేవలం మూడు దేశాలు మాత్రమే పాక్ ను సమర్థించాయన్నారు ప్రధాని మోదీ. మా చర్యలను ప్రపంచ దేశాలు సమర్ధించాయి. అందుకే పాక్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు ప్రధానమోదీ.