Gold Rate: శ్రావణమాసం శుభవార్త.. మంగళవారం తగ్గిన గోల్డ్, హైదరాబాద్ రేట్లు ఇలా..

Gold Rate: శ్రావణమాసం శుభవార్త.. మంగళవారం తగ్గిన గోల్డ్, హైదరాబాద్ రేట్లు ఇలా..

Gold Price Today: తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా పవిత్రంగా భావించే మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. దీనికి తోడు రానున్న కొన్ని రోజుల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులు ఉండటంతో చాలా మంది తమ అవసరాలకోసం గోల్డ్, సిల్వర్ ఆభరణాలు వస్తువుల షాపింగ్ షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవారం కూడా పసిడి ధరలు తగ్గటం కీలకంగా మారింది. వాస్తవానికి చైనాలో బంగారం డిమాండ్ దశాబ్ధకాల కనిష్ఠాలకు చేరుకోవటం గోల్డ్ రేట్లపై కొంత ఒత్తిడిని తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 150, ముంబైలో రూ.9వేల 150, దిల్లీలో రూ.9వేల 165, కలకత్తాలో రూ.9వేల 150, బెంగళూరులో రూ.9వేల 150, కేరళలో రూ.9వేల 150, పూణేలో రూ.9వేల 150, వడోదరలో రూ.9వేల 155, అహ్మదాబాదులో రూ.9వేల 155, జైపూరులో రూ.9వేల 165, మంగళూరులో రూ.9వేల 150, నాశిక్ లో రూ.9వేల 153, మైసూరులో రూ.9వేల 150, అయోధ్యలో రూ.9వేల 165, బళ్లారిలో రూ.9వేల 150, గురుగ్రాములో రూ.9వేల 165, నోయిడాలో రూ.9వేల 165 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.11 వందలు తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రేట్లను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 982, ముంబైలో రూ.9వేల 982, దిల్లీలో రూ.9వేల 997, కలకత్తాలో రూ.9వేల 982, బెంగళూరులో రూ.9వేల 982, కేరళలో రూ.9వేల 982, పూణేలో రూ.9వేల 982, వడోదరలో రూ.9వేల 987, అహ్మదాబాదులో రూ.9వేల 987, జైపూరులో రూ.9వేల 997, మంగళూరులో రూ.9వేల 982, నాశిక్ లో రూ.9వేల 985, మైసూరులో రూ.9వేల 982, అయోధ్యలో రూ.9వేల 997, బళ్లారిలో రూ.9వేల 982, గురుగ్రాములో రూ.9వేల 997, నోయిడాలో రూ.9వేల 997గా కొనసాగుతున్నాయి. 

ALSO READ : Upper Circuit: సూపర్ స్మాల్ క్యాప్ స్టాక్.. 29 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. రేటెంతంటే?

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 820గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 26వేల వద్ద ఉంది.