Upper Circuit: సూపర్ స్మాల్ క్యాప్ స్టాక్.. 29 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. రేటెంతంటే?

Upper Circuit: సూపర్ స్మాల్ క్యాప్ స్టాక్.. 29 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. రేటెంతంటే?

Colab Platforms Stock: గడచిన ఐదు ట్రేడింగ్ రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని ముగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు దూరంగా ఉండటం.. స్వదేశీ మార్కెట్లలో క్యూ1 ఫలితాల గందరగోళం నష్టాలకు కారణంగా నిలుస్తోంది. 

అయితే ఇలాంటి సమయంలో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ మాత్రం గడచిన 29 రోజుల నుంచి వరుసగా పెరుగుతూ అప్పర్ సర్క్యూట్ తాకటం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐటీ రంగానికి చెందిన ఈ మల్టీబ్యాగర్ స్టాక్ నేడు కూడా మార్కెట్లో 2 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.52.51 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.వెయ్యి 71కోట్లుగా ఉంది. అక్టోబర్ 2024లో రూ.5.42 వద్ద తన 52వారాల కనిష్ఠ ధర నుంచి ప్రస్తుతం షేరు 870 శాతం పెరుగుదలను చూసింది.

కంపెనీ 52వారాల గరిష్ఠ ధర రూ.76.18ని ఈ ఏడాది మే నెలలో తాకింది. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 1000 శాతం రాబడిని అందించి తన పెట్టుబడిదారులను సంపన్నులుగా మార్చింది. ఈ నెలలో ఇప్పటి వరకు స్టాక్ 50 శాతం వరకు పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం. 

స్టాక్ ఎందుకు పెరుగుతోందంటే..
ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టాక్ స్ప్లిట్ లేదా డివిడెండ్ ప్రకటన ఉండొచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా షేరుపై బెట్టింగ్ వేసేలా ప్రేరేపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కంపెనీ స్టాక్ స్ప్లిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు 2024లో కూడా ఒకసారి స్టాక్ స్ప్లిట్ నిర్వహించింది. డివిడెండ్ కూడా అందించింది.

►ALSO READ | Tesla: భారత రోడ్లపై టెస్లా కార్ తప్పులు.. సాఫ్ట్‌వేర్ 'దేశిఫై' చేయాలన్న ఓనర్..

ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న కంపెనీ 1989లో స్థాపించబడింది. కంపెనీ పేరు గతంలో కొల్లాబ్ క్లౌడ్ ప్లాట్ ఫారమ్స్. భారత మార్కెట్లో సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్న కంపెనీ పెరుగుతున్న టెక్ డిమాండ్ ద్వారా లాభపడుతోంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.