Tesla: భారత రోడ్లపై టెస్లా కార్ తప్పులు.. సాఫ్ట్‌వేర్ 'దేశిఫై' చేయాలన్న ఓనర్..

Tesla: భారత రోడ్లపై టెస్లా కార్ తప్పులు.. సాఫ్ట్‌వేర్ 'దేశిఫై' చేయాలన్న ఓనర్..

Tesla India: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా కొన్ని రోజుల కిందట తన మెుదటి భారతీయ షోరూం ముంబైలో ఓపెన్ చేసింది. ముందుగా భారత మార్కెట్లలోకి సంస్థ తన మోడల్ వై కార్లను అమ్మకానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాల నుంచి దీనిని దిగుమతి చేసుకోవటంతో బయటి మార్కెట్ల కంటే ఈ టెస్లా కార్ల రేటు భారతదేశంలో డబుల్ అయ్యింది. 

తాజాగా ముంబై రోడ్లపై టెస్లా వై మోడల్ కొనుగోలు చేసిన ఒక యజమాని తాను డ్రైవ్ చేస్తున్నప్పటి వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవటం ప్రస్తుతం వైరల్ అయ్యింది. వాస్తవానికి టెస్లా కార్లలో ఉండే అడ్వాన్స్ డ్రైవింగ్ ఫీచర్ కింద కారులో ఉన్న డ్రైవింగ్ చేసే వ్యక్తికి తన సెన్సార్ల ద్వారా చుట్టుపక్కల ఉన్న వాహనాల వివరాలను స్కీన్ మీద పంచుకుంటుంది. 

ALSO READ : Market Crash: ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ-సెన్సెక్స్.. కీలక కారణాలివే..

ఉదాహరణకు టెస్లా కారుకు చుట్టుపక్కన ఉన్న కార్లు, బైక్స్, ట్రక్స్ వంటి వాహనాలను స్కీన్ మీద డిస్ప్లే చేస్తుంటుంది. అయితే ఇండియా రోడ్లపై టెస్లా టెక్నాలజీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఇది సూచిస్తోంది. ముంబై రోడ్లపై డ్రైవ్ చేస్తున్న సమయంలో తన కారు చుట్టుపక్కల ఉన్న ఆటోలను కూడా టెస్లా సాఫ్ట్ వేర్ స్కూటర్లుగా చూపుతోందని సదరు వ్యక్తి వీడియోలో పంచుకున్నారు. 

 

భారత రోడ్లపై ఉన్న వాహనాలకు అనుగుణంగా కంపెనీ తన ఫీచర్లను కొంత మార్పులకు గురిచేయాల్సి ఉందంటూ సూచించారు. లోకల్ బాషలో చెప్పాలంటే టెస్లా ఫీచర్లను కొంత దేశిఫై చేయాలని అన్నారు. టెస్లా తన ఓఎస్ లో దీనికి సంబంధించిన మార్పులు చేయటం కీలకంగా సదరు వ్యక్తి సూచించారు. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు స్పందించటం లేదా మార్పులు చేస్తామని ప్రకటించటం లాంటి ప్రకటన చేయలేదు. కానీ భారత్ లో రోడ్లపై ఎక్కువగా ఆటోరిక్షాలు ఉంటాయి కాబట్టి ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా టెస్లా లవర్స్ కోరుతున్నారు.