
కరీంనగర్ వెలుగు ఫొటోగ్రాఫర్ : కరీంనగర్- హైదరాబాద్ హైవేపై రోడ్డు కుంగి భారీ గుంత ఏర్పడింది. ఎల్‌ఎండీ కాలనీలోని పాతాళ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కింద మట్టి కుంగి భారీ గుంత ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు నాలుగైదు ఫీట్ల లోతు గుంత ఏర్పడింది.