జ్యోతిష్యం : పుష్యమి నక్షత్రంలో బుధుడు సంచారం... 3 రాశుల అదృష్టంకలసి వస్తుంది.. మిగతా వారికి ఎలా ఉందంటే..!

జ్యోతిష్యం : పుష్యమి నక్షత్రంలో బుధుడు సంచారం...  3 రాశుల అదృష్టంకలసి వస్తుంది.. మిగతా వారికి ఎలా ఉందంటే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో..  బుధుడు  గ్రహాల రాకుమారుడు.   పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధుడు  తెలివితేటలకు.. వ్యాపారానికి  కీలకపాత్ర పోషిస్తాడని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.   బుధుడు జూలై 29న  సాయంత్రం 04:17 గంటలకు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 21 వరకు బుధుడు ఈ నక్షత్రంలో ఉంటాడు. శని నక్షత్రంలో బుధుడి సంచారం మూడు రాశుల ( సింహ, తుల, ధనస్సు) వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

 మేషరాశి:  పుష్యమి నక్షత్రంలో బుధుడి సంచారం వలన ఈ  రాశి వారికి అదృష్టం లభిస్తుంది. వ్యాపారులకు పాత పెట్టుబడులతో మంచి రాబడి లభిస్తుంది. ఉద్యోగస్తులకు  ప్రశంసలు లభిస్తాయి. ఆఫీసులో మీరే కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి: బుధుడు నక్షత్రరాశి మార్పు కారణంగాఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉటుంది. గతంలో ఉన్న  సమస్యలు నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కాలం కలిసివచ్చి జాబ్ సంపాదిస్తారు. వ్యాపారాలు రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అంతా మంచిగినే జరిగిపోతుంది. 

మిథునరాశి: బుధుడి సంచార ప్రభావంతో ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. స్కిల్స్​ పెరిగి.. ఆఫీసులో మీరు కీలకం కానున్నారు. మార్కెటింగ్, చట్టం లేదా కన్సల్టెన్సీ వంటి రంగాలతో సంబంధాలు ఉండే వ్యక్తులు ప్రత్యేక విజయాలను సాధిస్తారు. పెండింగు పనులు కంప్లీట్​అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి:  ఈ రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెట్టడానికి  ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ విరు అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది.  అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు అమితమైన లాభాలు కలుగుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.  డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. ముఖ్యంగా ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. 

ALSO READ : ఆధ్యాత్మికం: భగవంతుడు ఎవరు.. ఆయన ఎప్పుడు.. ఎక్కడ .. ఎలా ఉంటాడు..

సింహరాశి: బుధుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నంత కాలం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కెరీర్‌లో పురోగతి సాధించే  అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  వ్యాపారస్తులకు  అధికంగా లాభాలుంటాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​వింటారు. అంతా మంచిగానే ఉంటుంది.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. 

కన్యారాశి: ఈ రాశి వారికి బుధుడు ప్రత్యేక ప్రభావం చూపనున్నాడు.  కెరీర్ పరంగా కొత్త  బాధ్యతలు తీసుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  ఇతరులతో మాట్లాడేడప్పుడు ఓర్పు.. సహనంతో ఉండండి. ఏ  విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి: బుధుడు పుష్యమి  నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
 వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ లక్ష్యానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.  ఆర్థికంగా బాగాఅభివృద్ది చెందుతారు.  శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుందని  పండితులు చెబుతున్నారు. 

ధనుస్సురాశి: ఆగస్టు 21 వరకు ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొత్తగా పెట్టుబడి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్​లు వచ్చే అవకాశం ఉంది. 

మకరరాశి:  బుధుడు నక్షత్రం మారడం వలన ఈ రాశి వారు జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  ఆఫీసులో సీనియర్ల సహకారం ఉంటుంది.  ఆర్ధిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది.  వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదావేయండి. 

 కుంభ రాశి: పుష్యమి నక్షత్రంలోకి బుధుడు సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికలావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టేవిషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు.. గణేశుని పూజించండి.. ఉపశమనం కలుగుతుంది. 

 మీనరాశి: ఈ  రాశి వారి వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ..ప్రతి పనిలో కూడా  అవాంతరాలు వస్తాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వలన ఉపశమనం కలుగుతుంది.