
తిరుమలలో శ్రీవారి భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే దిశగా ఐదు పెద్ద హోటళ్ల టెండర్లను ఖరారు చేసింది టీటీడీ. మంగళవారం ( జులై 29 ) ఖరారు చేసిన ఈ టెండర్లకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చెన్నైకి చెందిన అడయర్ ఆనంద్ భవన్ కి తిరుమలలోని శ్రీవత్స హోటల్, హైదరాబాద్ కి చెందిన దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి కౌస్తుభం గెస్ట్ హౌస్ హోటల్ టెండర్లు దక్కాయి.
హైదరాబాద్ కి చెందిన ప్రిజం హాస్పిటాలిటీకి సందీప్ మయూర హోటల్, ముంబైకి చెందిన శ్రీ సుఖ్ సాగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ కి ఎస్వీ గెస్ట్ హౌస్ సారంగీ హోటల్, గుజరాత్ కి చెందిన సంకల్ప రిక్రియేషన్ కి సప్తగిరి గెస్ట్ హౌస్ హోటల్ టెండర్లు దక్కాయి. ఈ మేరకు టెండర్లు ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది టీటీడీ.
►ALSO READ | వైజాగ్ లో పార్ట్నర్ షిప్ సమ్మిట్... ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ..
ఇదిలా ఉండగా.. తిరుమలలో హోటల్ టెండర్లకు సంబంధించి టీటీడీ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హోటళ్ల అద్దె తగ్గింపు, మూడేళ్లు ఉన్న గడువు ఐదేళ్లకు పెంపు వంటి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు పెద్ద హోటల్స్ నిర్వహించేందుకు గత ఇలలో టెండర్లు ఆహ్వానించింది టీటీడీ. టెండర్లో పాల్గొనాలంటే కచ్చితంగా హిందువు అయ్యుండాలని.. హోటల్ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని, కనీసం పది హోటళ్లు నడుపుతూ ఉండాలని తెలిపింది టీటీడీ.