తెలుగు సాహితీవేత్త, ప్రజా కవి అందె శ్రీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అందెశ్రీ మరణ వార్త విని ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు చెప్పారు. ఆయన మరణం ఎంతో బాధాకరం.. తెలంగాణ ప్రజలకు, తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి వివేక్.
అందెశ్రీ నిజమైన జ్ఞానానికి ప్రతీక అని అన్నారు. ఆయన రచనలు, కవిత్వం, సమాజంపై చిత్తశుద్ధి.. తరతరాకు నైతిక విలువలను పాటించే మార్గంలో ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. జయ జయ హే తెలంగాణ .. గీతం రూపంలో ఆయన చిరకాలం నిలిచిపోతారని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రఘాడ సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అందెశ్రీ 2025 నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ను రచించారు అందెశ్రీ.
