రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుకు ప్రీ పోన్ చేస్తూ నవంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫ్యాన్స్ ఒకరోజు ముందే అడ్వాన్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఈ అప్‌డేట్‌ను అందించింది మూవీ టీమ్. ఈనెల 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రామ్ కెరీర్‌లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర, వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ సంగీతం అందించారు.
